calender_icon.png 12 February, 2026 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సఫారీల సూపర్ విజయం

12-02-2026 12:50:50 AM

  1. వణికించిన ఆప్ఘనిస్థాన్

తృటిలో చేజారిన సంచలనం

రెండో సూపర్ ఓవర్లో గట్టెక్కిన సఫారీలు

అహ్మదాబాద్, ఫిబ్రవరి 11 : టీ20 ప్రపంచకప్‌లో అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠతో ఊపేసింది. అసలు గెలుపు మీద ఆశలేని ఆప్ఘనిస్థాన్ పోరాటంతో మ్యాచ్ టై కావడం.. తర్వాత ఒకటి కాదు.. రెండు సూపర్ ఓవర్లతో ఫలితం తేలడం అభిమానులకు మంచి కిక్కిచ్చింది. మొదట బ్యా టింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు చేసింది. మాక్ రమ్ నిరాశపరిచినా.. డికాక్, రికెల్టన్ హాఫ్ సెంచరీలతో దుమ్మురేపారు. భారీ షాట్లతో రెచ్చి పోయారు. డికాక్ కేవలం 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 పరుగులు చేశాడు.

కేవలం 28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగు లు చేశాడు. చివర్లో మిల్లర్, స్టబ్స్ కూడా భారీ షాట్లతో ధాటిగా ఆడడంతో సౌతాఫ్రికా స్కోరు 180 దాటింది. భారీ లక్ష్యఛేదన లో ఆఫ్ఘనిస్థాన్ కూడా కేవలం 42 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 84 పరుగులు చేశాడు. అయితే మరోవైపు వరుసగా వికెట్లు పడడంతో ఆఫ్ఘనిస్థాన్ గెలు పు కష్టం గా కనిపించింది. చివర్లో రషీద్ ఖా న్, నూర్ అహ్మద్ విధ్వంసకర బ్యాటింగ్‌తో అదరగొట్టారు. 

చివర్లో రబాడ రెండు నోబాల్స్ వే యడం కొంపముంచింది.మ్యాచ్ టై అ యిం ది. దీంతో ఫలితం కోసం సూపర్ ఓవర్‌ను నిర్వహించారు. మొదటి సూపర్ ఓవ ర్లో ఆప్ఘనిస్థాన్ ధాటిగా ఆడి 17 పరుగులు చేసిం ది. ఛేజింగ్‌లో సౌతాఫ్రికా కూడా అదే స్కోరు సాధించడంతో రెండో సూపర్ ఓవర్ ఆడక తప్పలేదు. రెండో సూపర్ ఓవర్లో సౌ తాఫ్రికా 23 పరుగులు చేసింది. రెండో సూ పర్ ఓవర్లోనూ ఆఫ్ఘనిస్థాన్ విజయం కోసం చివరి వరకూ పోరాడింది.

రెండో బంతికే నబీ ఔటైనప్పటకీ.. తర్వాత గుర్బాజ్ వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. దీంతో చివ రి బంతికి  సిక్స్ కొట్టాల్సి ఉండగా కేశవ్ మహారాజ్ వైడ్ వేశాడు. అయితే తర్వాత భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో గుర్బాజ్ క్యా చ్ ఇవ్వడంతో ఆప్ఘనిస్థాన్ విజయానికి 4 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సౌతాఫ్రికాకు ఇదే రెండో విజయం.