12-02-2026 12:57:50 AM
తొలి మ్యాచ్‌లో తడబడి గెలిచిన భారత్ ఇప్పుడు నమీబియాపై భారీ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. అభిషేక్ శర్మకు అస్వస్థత ఇబ్బంది పెడుతున్నా బ్యాకప్ ఓపెనర్ గా సంజూకు ఛాన్స్ దొరకనుంది. అటు బుమ్రా రీఎంట్రీతో పేస్ పదును పెరగనుండగా.. తుది జట్టు కాంబినేషన్‌లో మార్పులపై ఆసక్తి నెలకొంది. ఇక యూఎస్‌ఏపై ఫ్లాప్ అయిన బ్యాటర్లు ఫామ్ అందుకుంటారా అనేది చూడాలి.
భారీ విజయమే భారత్ లక్ష్యం
అభిషేక్ శర్మ డౌట్, సంజూకు ఛాన్స్
బుమ్రా రీఎంట్రీతో సిరాజ్‌పై వేటు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 : టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు రెం డో మ్యాచ్‌కు సిద్ధమైంది. తొలి మ్యాచ్ యూఎస్‌ఏపై గెలిచి శుభారంభం చేసిన భారత్ ఇప్పుడు పసికూన నమీబియాతో తలపడబోతోంది. ఫిబ్రవరి 15న పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు బ్యాటర్లు పూర్తి ఫామ్ అం దుకునేందుకు ఈ మ్యాచ్ మంచి అవకాశంగా చెప్పొ చ్చు. ఎందుకంటే యూఎస్‌ఏపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తప్పిస్తే మిగిలిన వారంతా నిరా శపరిచారు.
అందుకే నమీబియాపై బ్యాటర్లు సత్తా చాటాలని టీమిండియా మేనేజ్ మెంట్ ఎదురుచూస్తోంది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌కు ముందు ఓపెన ర్ అభిషేక్ శర్మ అస్వస్థతకు గురవడం ఆందోళన కలిగిస్తోంది. గత రెండురోజులుగా ఉదర సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్న అభిషేక్ శర్మ బుధవారం హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాడు. ఇన్ఫెక్షన్ నుంచి కోలుకుని సాయంత్రం డిశ్చార్జ్ కూడా అయ్యాడని తెలుస్తోంది.
అయితే తుది జట్టు లో అభిషేక్‌ను ఆడించడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తిలక్ వర్మ తెలిపాడు. నిజానికి అభిషేక్ కోలుకోవడం సందిగ్ధంగా ఉండడంతో సంజూ శాంసన్‌ను ఆడించేందుకు భారత్ ప్రిపేరయింది. దీనికి తగ్గట్టే నెట్స్‌లో సంజూ, ఇషాన్ చాలా సేపు శ్రమించారు. ఇప్పుడు అభిషేక్ శర్మ కోలుకుంటే మాత్రం సంజూకు ఛాన్స్ లేనట్టే. మరోవైపు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడడం ఖాయమైంది. తొలి మ్యాచ్‌కు దూరమైన బుమ్రా ఇప్పుడు రీఎంట్రీ ఇవ్వనున్నాడు. దీంతో సిరాజ్ , అర్షదీప్‌లలో ఒకరిపై వేటు పడనుంది.
అటు వాషింగ్టన్ సుందర్ కూడా పూర్తిగా కోలుకుని అందుబాటులోకి రావ డం జట్టుకు కలిసొచ్చే అంశం. కానీ వాషింగ్టన్ సుం దర్‌కు తుది జట్టులో చోటు దక్కకపోవచ్చని సమాచారం. ఇదిలా ఉంటే తొలి మ్యాచ్‌లో యూఎస్‌ఏపై ఇషాన్ కిషన్, తిలక్ వర్మ మెరుపులు పూర్తిస్థాయిలో కనిపించలేదు. పాక్‌తో మ్యాచ్ కు ముందు వీరిద్దరితో పాటు శివమ్ దూబే, రింకూ సింగ్ లాంటి హిట్టర్లు పూర్తి ఫామ్ అందుకోవాలని మేనే జ్ మెంట్ కోరుకుంటోంది.
పాండ్యా కూడా చెలరేగితే తిరుగుండదు. బౌలింగ్ కూర్పును చూస్తే అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి స్పిన్ ఎటాక్‌లో కీలకం కానుండగా.. బుమ్రా, అర్షదీప్ పేస్ భారాన్ని మో యనున్నారు. ఇక నమీబియా విషయానికొస్తే ఆ జట్టుపై పెద్దగా అంచనాలు లేకపోవడంతో స్వేచ్ఛగా ఆడనుంది. భారత్‌కు గట్టిపోటీ ఇవ్వాలని పట్టుదలగా ఉన్న నమీబియాను తేలిగ్గా తీసుకున్నా ప్రమా దమే. ఎందుకంటే టీ20 ఫార్మాట్ కావడంతో ఎవ్వరినీ తక్కువ అంచనా వేయలేం.
పిచ్ రిపోర్ట్:
మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో పిచ్ బ్యాటర్లకు అనుకూలిసిస్తుందని అంచనా. అదే సమయంలో ఫాస్ట్ బౌలర్లకు సహకరించొచ్చు. ఓవరాల్‌గా ఛేజింగ్ జట్టుకు విజయావకాశాలు ఉంటాయి.
తుది జట్లు అంచనా:
భారత్ : అభిషేక్ శర్మ/సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్) , తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్థిక్ పాండ్యా, రింకూ సింగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, బుమ్రా/సిరాజ్, వరుణ్ చక్రవర్తి
నమీబియా: లారెన్ స్టీన్ క్యాప్‌ం, ఫ్రైలింక్, లొఫ్టీ ఈటన్, ఎరాస్మస్ (కెప్టెన్), స్మిట్, జేన్ గ్రీన్ ( వికెట్ కీపర్), డైలన్ లీచర్, విలియమ్ మైబర్గ్, రూబెన్, బెర్నార్డ్, బెన్ షికాంగో