జౌళి నాలలో పూడిక తొలగింపు
27-06-2026 03:26 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని జౌళి నాలాలో పూడికతీత కార్యక్రమం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. పట్టణంలోని రామ్ రావ్ బాగ్ కాలువ గడ్డ సోమార్పేట్ బాలాజీ వాడ కురన్నపేట తదితర కాలనీలో ఉన్న నాళాల పేరుకుపోయిన చెత్త పిచ్చి మొక్కలు తొలగించి వరద ముప్పు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్టు మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి తెలిపారు.






