27 June, 2026 | 4:39 PM

ఇందిరమ్మ ఇళ్ల శ్లాబ్ సైజుపై ప్రభుత్వం కీలక ప్రకటన

27-06-2026 03:25 PM
  1. ఇందిరమ్మ ఇళ్ల శ్లాబ్ విస్తీర్ణం 500 నుంచి 750 చదరపు అడుగులు మాత్రమే.
  2. తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ విడుదల.
  3. ఖర్చు నియంత్రణ కోసమే నిర్ణయమన్న హౌసింగ్ కార్పొరేషన్
  4. స్లాబు ముందువైపు 3 అడుగులు, మిగతా వైపుల ఒక అడుగు మాత్రమే 

హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల శ్లాబ్ సైజుపై తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందిరమ్మ ఇళ్ల(r Indiramma houses) శ్లాబ్ 500 నుంచి 750 అడుగులు మాత్రమే ఉండాలని జీవో విడుదల చేసింది. స్లాబు ముందువైపు 3 అడుగులు, మిగతా వైపు ఒక అడుగే ఉండాలని ఉత్తర్వులో పేర్కొంది. లబ్ధిదారులు శ్లాబ్ విస్తీర్ణం పెరగటం వల్ల ఖర్చు పెరుగుతోందని హౌసింగ్ కార్పొరేషన్ వెల్లడించింది. నిర్మాణ ఖర్చు పెరకకూడదనే శ్లాబ్ విస్తీర్ణంపై పరిమితులు విధించినట్లు గృహనిర్మాణ శాఖ కార్యదర్శి వి.పి గౌతమ్ ఉత్తర్వులు జారీ చేశారు.