జోరు కొనసాగించేదెవరు?
చెన్నైతో పోరుకు సన్‌రైజర్స్ రెడీ
ధోనీ ఆడడంపై సస్పెన్స్
మరోసారి పరుగుల వరద ఖాయం
హైదరాబాద్, ఏప్రిల్ 17 : ఐపీఎల్ 19వ సీజన్ మూడో వారం చివర్లో ఉంది. గత వారం రోజులుగా మ్యాచ్ లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ప్లే ఆఫ్ రేసులో వెనుకబడకుండా ఉండేందుకు విజయం కోసం అన్ని జట్లు స ర్వశక్తులూ ఒడ్డుతున్నాయి.
ఈ క్రమంలో పడుతూ లేస్తూ సాగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గత మ్యాచ్‌తో పుంజుకుంది. రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తుగా ఓడించి ఒక్కసారిగా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. మూడు మ్యాచ్‌లు ఓడినప్పటకీ రాజస్థాన్ పై సాధించిన విజయంతో రన్‌రేట్ కూడా మెరుగుపరుచుకుంది. ఆ మ్యాచ్ లో సన్‌రైజర్స్ బ్యాటర్లు అదరగొట్టారు. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ మరికొెంచెం పుంజుకుంటే మాత్రం తిరుగుండదు.
అటు బౌలింగ్ లోనూ సన్ రైజ ర్స్ పూర్తిగా గాడిన పడినట్టే కనిపిస్తోంది. అప్పటి వరకూ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని రాజస్థాన్ రాయల్స్‌కు దిమ్మతిరిగే షాకిచ్చింది. బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ, హెడ్ నుంచి కూడా విధ్వంసకర ఇన్నింగ్స్‌లు వస్తే మా త్రం ఎదురులేనట్టే. అటు బౌలింగ్‌లో ప్రఫుల్, హొస్సేన్‌తో పాటు హర్షల్ పటేల్ కూడా చెలరేగితే చెన్నైని కట్టడి చేయడం పెద్ద కష్టం కాదు.
స్పెషలిస్ట్ స్పిన్నర్ లేని లోటు కనిపిస్తోంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ కూడా సీజన్‌ను ఓటమితో మొదలుపెట్టింది. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. సంజూ శాంసన్‌ను అసలు ఎందుకు తీసుకున్నారన్న మా టలు కూడా వినిపించాయి. కానీ గత రెండు మ్యాచ్‌ల నుంచి సీఎస్కే ఆటతీరు మారిపోయింది. ఢిల్లీతో మ్యాచ్ లో అయితే శాంసన్ సెంచరీతో రెచ్చిపోయాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో తనపై వచ్చిన విమర్శలకు బ్యాట్ తోనే జవాబిచ్చాడు.
సంజూతో పాటు ఆయుశ్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, బ్రెవిస్ చెన్నై బ్యాటింగ్‌కు బలంగా చెప్పొచ్చు. కెప్టెన్ రుతురాజ్ కూడా బ్యాట్‌కు పనిచెబితే సీఎస్కేకు తిరుగుండదు. అటు ధోనీ ఈ మ్యాచ్‌లో ఆడడం కూడా అనుమానంగానే ఉంది. బౌలింగ్ పరంగా చూస్తే ఖలీల్ అహ్మద్ దూరమవడం పెద్ద ఎదురుదెబ్బ. దీంతో అన్షుల్ కాంబోజ్, ఓవర్టన్, నూర్ అహ్మద్ లపైనే భారం పడనుం ది. కాగా ప్రస్తుతం చెన్నై సూపర్‌కింగ్స్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్‌ను నిలువరిం చి హాట్రిక్ విజయంతో తమ స్థానం మెరుగుపరుచుకోవాలని ఎదురుచూస్తోంది.
తుది జట్లు అంచనా
సన్‌రైజర్స్ హైదరాబాద్ : అభిషేక్ శర్మ, హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్), క్లాసెన్, సలీల్ అరోరా (కీపర్), అనికేత్ వర్మ, నితీశ్ కుమార్‌రెడ్డి, హర్ష దూబే, శివాంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, ఎహసాన్ మలింగ
చెన్నై సూపర్‌కింగ్స్ : సంజూ శాంసన్ (కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుశ్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, దూబే, బ్రెవిస్, ఓవర్టన్, అకిల్ హొస్సేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జపనీత్ సింగ్






