రాజస్థాన్ మేనేజర్‌కు లక్ష జరిమానా
ముంబై, ఏప్రిల్ 17: నిబంధనలకు విరుద్ధంగా డగౌట్‌లో మొబైల్ ఫోన్ ఉపయోగిం చిన రాజస్థాన్ రాయల్స్ మేనేజర్ రోమి బిం దర్‌పై బీసీసీఐ చర్యలు తీసుకుంది. బిందర్కు రూ.లక్ష జరిమానా విధించింది. ఇదే తొలిసా రి కావడంతో అతడు నిషేధం నుంచి తప్పించుకోగలిగాడు. ఏప్రిల్ 10న గువాహటిలో బెంగళూరు, రాజస్థాన్ మ్యాచ్ సందర్భంగా బిందర్ డగౌట్లో ఫోన్ చూస్తూ కెమెరాలకు చిక్కారు.
తర్వాత ఆ ఫొటో బాగా వైరల్ అయింది. దీనిపై సీరియస్ అయిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ బిందర్‌కు షోకా జ్ నోటీసు జారీ చేసింది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే, అత డి వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన యాంటీ కరప్షన్ యూనిట్ క్రమశిక్షణా చర్యలకు సిఫార్సు చేసింది. ఆట స్ఫూర్తి దెబ్బతిన కుండా ఈ ఘటన ప్రతిఒక్కరికీ ఓ హెచ్చరిక అని బీసీసీఐ సెక్రటరీ దేవ్‌జిత్ సైకియా వ్యాఖ్యానించారు.






