1 July, 2026 | 8:52 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

బ్యాట్ ఈసీ మెంబర్‌గా సుధాకర్

23-04-2026 12:01 AM

మంచిర్యాల టౌన్, ఏప్రిల్ 22: బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(బ్యాట్) ఎగ్జిక్యూటివ్ మెంబర్ (ఈసీ)గా స్టార్ మంచిర్యాల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పుల్లూరి సుధాకర్ ఎన్నికయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో జరిగిన ఎన్నికల్లో బ్యాట్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా ఇందులో జిల్లా నుంచి సుధాకర్ ఈసీ మెంబర్‌గా ఎన్నికయ్యారు. కమిటీ నాలుగు సంవత్సరాలు కొనసాగనుంది. బ్యాట్ ఈసీ మెంబర్‌గా ఎన్నికైన సుధాకర్‌ని జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు గాజుల ముఖేష్‌గౌడ్, ఉపాధ్యక్షులు భాస్కర్ల వాసు, బండ మీనా రెడ్డి, జాయింట్ సెక్రెటరీ రమేష్ రెడ్డి, ట్రెజరర్ సత్యపాల్ రెడ్డి,ఈసీ మెంబర్లు, సీనియర్ క్రీడాకారులు అభినందించారు.