21 August, 2026 | 8:22 PM

రేపు క్రీడా సమాఖ్య సమావేశం

21-08-2026 06:25 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): విద్యాశాఖ ఆధ్వర్యంలో 2026 సంవత్సరం జిల్లా మరియు రాష్ట్ర స్థాయి క్రీడల నిర్వహణపై చేర్చించడం కొరకు నిర్మల్ జిల్లా పాఠశాల క్రీడ సమాఖ్య సమావేశం శనివారం నిర్వహిస్తున్నట్టు విద్యాశాఖ అధికారి దర్శనం భోజన తెలిపారు. ఉదయం 10.00 గంటలకు ఎన్టీఆర్ మిని స్టేడియంలో నిర్వహించి ఈ సమావేశానికి 2026 సంవత్సరం జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడల నిర్వహణ కొరకు ఆసక్తి ఉన్న వ్యాయమ ఉపాధ్యాయులు తమ ప్రదనోపాధ్యాయుల అనుమతి తో ప్రతిపాదనలు తీసుకొని రావాలని వారు తెలిపారు.ఈ సమావేశం కి నిర్మల్ జిల్లా వ్యాయమ ఉపాధ్యాయులని రిలీవ్ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి పాఠశాల ప్రధానోపాధ్యాయులకి సూచించారు