1 July, 2026 | 7:47 PM

Breaking News

బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •   ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •   కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •   డిబిఎమ్ 6 కాల్వకు గండి   •   ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీతో శాతవాహన అవగాహన ఒప్పందం   •   సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •  

అక్రమార్కుల చెరలో నస్పూర్ ఊర చెరువు

23-04-2026 12:00 AM

మంచిర్యాల, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ ఊర చెరువు నాయకుల, అధికారుల అండదండలతో అక్రమార్కులు అడ్డగోలుగా ఆక్రమించుకుంటున్నారు. ఎఫ్‌టీఎల్ లెవల్ దాటి మట్టిని రోజుకు కొంతమేర నింపుతూ దర్జాగా కబ్జా చేస్తున్నారు. ఇదంతా అధికారులకు తెలిసే జరుగుతుందని, ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని, అటు ఇరిగేషన్, ఇటు రెవెన్యూ అధికారులకు మొర పెట్టుకున్నా ఫలితం లేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.

చెరువును ఆక్రమించి ప్లాట్లుగా మార్చి విక్రయిస్తుంటే నాయకులు, అధికారులు మిన్నకుండి, వారికి సహకరిస్తున్నారని ఇప్పటికైనా అధికారులు కండ్లు తెరిచి చూడాలని, చెరువు ఆక్రమణను ఆపాలని మత్య్సకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం నస్పూర్ ప్లడ్ కాలనీ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నాయకులు నస్పూర్ తహశీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసి చెరువును రక్షించాలని వేడుకున్నారు. అధికారులు ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాల్సిందే.