వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సుడా చైర్మన్
22-04-2026 04:51 PM
ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ రూరల్ మండలం నగునూరు, ఏలబోతారం, చామన్ పల్లి, బహదూర్ఖాన్ పేట్, దుబ్బపల్లి, చర్లభూత్కూర్ గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని నరేందర్ రెడ్డి తెలిపారు. గత వారం రోజులుగా ధాన్యం వస్తుందని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన వెంటనే తూకం ప్రారంభించి మిల్లులకు ధాన్యం తరలించే వరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.






