22 April, 2026 | 6:19 PM

మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో సూరయ్యపల్లి అభివృద్ధి

22-04-2026 04:54 PM

సైడ్ డ్రైనేజ్ పనుల ప్రారంభోత్సవంలో సర్పంచ్ నాగరాజు

మంథని,(విజయక్రాంతి): మంథని మండలం సూరయ్య పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మేరీ మీడియా స్కూల్ ఎదురుగా నిర్మిస్తున్న సైడ్ డ్రైనేజ్ కు బుధవారం గ్రామ సర్పంచ్ ఆర్ల నాగరాజు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు.  ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ  రాష్ట్ర మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీ పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో డిఎంఎఫ్టీ నిధుల నుండి రూ.10 లక్షలతో నిధులు మంజూరు చేయడం జరిగిందని, గ్రామ ప్రజలకు తెలిపారు. సురయ్యపల్లి గ్రామం అంటే అభివృద్ధికి చిరునామాగా తీర్చి దిద్దుతామని ప్రజలకు హామీ ఇచ్చారని,  అభివృద్ధి లక్ష్యంగా గ్రామ సర్పంచులు ఉండాలని శ్రీధర్ బాబు  పిలుపునివ్వడం ఎంతో సంతోషకరమని అన్నారు. శ్రీను బాబు గ్రామం పై ప్రత్యేక దృష్టిని సారించారని  అభివృద్ధికి అధిక నిధులు మంజూరు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.