కాలేయ క్యాన్సర్‌కు చికిత్స విజయవంతం
మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ఘనత
హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌కు చెందిన జయలక్ష్మి(56) అనే మహిళ చివరి దశ కాలేయ క్యాన్సర్ (హెపాటోసెల్యులార్ కార్సినోమా)తో బాధపడుతున్నది. మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ వైద్యులు అత్యాధునిక ఇమ్యు నోథెరపీ, టార్గెటెడ్ థెరపీ ద్వారా విజయవం తంగా చికిత్స అందించారు. మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ హీమాటో-ఆంకాలజిస్ట్ డా. ఎ. వేణుగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. మహిళకు నిర్వహించిన ఎంఆర్‌ఐ, ఎఫ్‌ఎన్‌ఏసీ, పెట్‌సిటి పరీక్షల్లో కాలేయ క్యాన్సర్ కుడి 7వ పక్కటెముక, డీ 10 వెన్నెముక వరకు వ్యాపించినట్లు గుర్తించారు. అనంతరం అతేజోలీజుమాబ్ ఇమ్యునోథెరపీతో పాటు బెవసిజుమాబ్ టార్గెటెడ్ థెరపీని ప్రారంభిం చారు. ఆరు సైకిళ్ల చికిత్స అనంతరం నిర్వహిం చిన పెట్‌సిటిలో కాలేయంలోని క్రియాశీల క్యాన్సర్ పూర్తిగా కనిపించకపోవ డంతో పాటు, పక్కటెముక, వెన్నెముకకు వ్యాపించిన క్యాన్సర్ కూడా గణనీయంగా తగ్గినట్లు వెల్లడైంది. ప్రస్తుతం రోగికి ఏడో సైకిల్ చికిత్స విజయ వంతంగా అందించగా, ఆమె ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఏ వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఆధునిక ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ వల్ల చివరి దశ కాలేయ క్యాన్సర్ రోగుల్లోనూ ఆశాజనక ఫలితాలు సాధ్యమవుతున్నాయని, లక్షణాలు కనిపించిన వెంటనే నిపుణులను సంప్రదించి చికిత్స ప్రారంభిస్తే మెరుగైన ఫలితాలు పొందవచ్చని సూచించారు.






