12 July, 2026 | 5:27 AM

ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతి ఓటు అమూల్యమైనది

12-07-2026 12:00 AM

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

కూకట్‌పల్లి, జూలై 11 (విజయక్రాంతి): ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతి ఓటు అమూల్యమైనదని, ఓటు హక్కు కోల్పోతే ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదం ఏర్పడుతుందని పిఎసి చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ పరిధి రిక్షా పుల్లర్ కాలనీలో జరుగుతున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని శనివారం స్థానిక ఏఎంసీ వహీద్ అలీతో కలిసి పరిశీలించారు.

ఎలక్షన్ కమిషన్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న (ఎస్‌ఐఆర్ ) ఓటర్ ప్రత్యేక సమగ్ర సవరణలో ప్రతి ఓటర్ పాల్గొని ఎమ్యూనరేషన్ పత్రాలను సరైన విధంగా పూర్తి చేసి బిఎల్‌ఓ లకు అందజేయాలని సూచించారు. రాజ్యాంగం మనకు కల్పించిన ఆయుధం ఓటు హక్కు అని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిన గొప్ప ప్రజాస్వామ్య దేశం మనదన్నారు.

ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతి ఓటు అమూల్యమైనదని, ఓటు హక్కు కోల్పోతే ప్రజాస్వామ్యానికే ప్రమాదం ఏర్పడుతుందని కావున ప్రతి ఒక్కరు ఎస్ ఐ ఆర్ లో పాల్గొని తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు.18 సంవత్సరాల నిండిన యువకుడి నుండి వయోజనుడి వరకు ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని,భావి భారత పౌరుడి నైతిక హక్కు ఓటు హక్కుఅన్నారు.

పేద మధ్యతరగతి ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలలో ఎస్ ఐ ఆర్ ప్రక్రియకు భారీగా స్పందన వస్తున్నదని, ఎమ్యూనరేషన్ ఫామ్ లు పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. బి ఎల్ వో లు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నప్పటికీ సమయం తక్కువగా ఉండటం,5 రోజులు ఆలస్యంగా రావడం, గేటెడ్ కమ్యూనిటీ, హై రైజ్ అపార్ట్మెంట్లలోకి అనుమతులు లేకపోవడం లాంటి సమస్యలు గుర్తించినట్లు పి ఏ సి చైర్మన్ గాంధీ తెలిపారు.

బి ఎల్ వో ల నుండి తీసుకున్న ఎమ్యూనరేషన్ పత్రాలను తిరిగి వారికి అందజేయడం లేదని, వాటిని పూర్తి చేసి తిరిగి బిఎల్‌ఓ లకు అందజేసినప్పుడే ఓటు నమోదు అవుతుందని పేర్కొన్నారు. ఓటు హక్కును కోల్పోతే అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, సంక్షేమ పథకాలను కోల్పోయే ప్రమాదం ఉందని తప్పనిసరిగా ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో పాల్గొని ఓటు హక్కును కోల్పోకుండా చూసుకోవాలని సూచించారు.

భవిష్యత్తులో ఆధార్ లాగా ఓటు హక్కు ఉందా ఉంటే ఏ ప్రాంతంలో ఉంది అని అడిగి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఓటు నమోదుకు జులై 24 చివరి తేదీ అని, బి ఎల్ వో లు మీ ఇంటి వద్దకే వచ్చి ఎస్‌ఐఆర్ ప్రక్రియను పూర్తి చేస్తున్నారని, ఆ తర్వాత నమోదు చేసుకుంటామంటే అవకాశం ఉండదని, అప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని   సూచించారు. ఈ కార్యక్రమంలో బిఎల్‌ఓ పుష్ప, నాయకులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.