11 July, 2026 | 3:06 AM

మత్స్యరంగ చరిత్రలో సరికొత్త విప్లవం

11-07-2026 12:44 AM
  1. కోహెడలో అంతర్జాతీయ చేపల మార్కెట్కు శంకుస్థాపన
  2. రూ.47.03 కోట్లతో ఎగుమతి ఆధారిత ఇంటిగ్రేటెడ్ హబ్
  3. ముదిరాజుల సంక్షేమం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం  
  4. మంత్రి వాకిటి శ్రీహరి
  5. గతంలో చేప పిల్లలను చూపి చెరువుల్లో మట్టి అమ్ముకున్నారు
  6. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి

రంగారెడ్డి /అబ్దుల్లాపూర్మెట్,జులై 10(విజయక్రాంతి): తెలంగాణ మత్స్యరంగ చరిత్రలో ఓ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలోనే సముద్రతీరం లేని ఒక అంతర్గత రాష్ట్రంలో ఏర్పాటు కానున్న తొలి ఆధు నిక మంచినీటి చేపల ఎగుమతి కేంద్రానికి రంగారెడ్డి జిల్లా కోహెడలో పునాది పడింది.

రూ.47.03 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ ‘ఎగుమతి ఆధారిత ఇంటిగ్రేటెడ్ హోల్సేల్ చేపల మార్కెట్’కు రాష్ట్ర ప శుసంవర్ధక, మత్స్య, యువజన సర్వీసులు & క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శుక్రవా రం శంకుస్థాపన చేశారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి ఆయన భూమిపూజ నిర్వహించారు.

జాతీయ మత్స్య రైతుల దినోత్సవం సందర్భంగా ఈ భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టడం గమనార్హం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ‘ముదిరాజుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. అవసరమైతే నా మంత్రి, ఎమ్మెల్యే పదవులకే కాకుండా ముదిరాజుల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం‘ అని స్పష్టం చేశారు.

సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం మత్స్యకారుల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ప్రస్తుతం మంచినీటి చేపల ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, ఈ కొత్త కేంద్రం ద్వారా మన చేపలకు అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పెరుగుతుం దని చెప్పారు. ప్రధానమంత్రి మత్స్య సం పద యోజన కింద కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు తెలిపారు.

అత్యాధునిక వసతులు: 

13 ఎకరాల ప్రభుత్వ భూమిలో నిర్మించే ఈ మార్కెట్లో శీతల గిడ్డంగులు (కోల్ స్టోరేజ్), శుద్ధి యూనిట్లు, ప్యాకేజింగ్ కేంద్రా లు, శిక్షణా కేంద్రం, కస్టమ్స్ సదుపాయాలు ఏర్పాటు కానున్నాయి.ఈ కేంద్రం ద్వారా సుమారు 2,000 మంది వ్యాపారులకు వ్యాపార అవకాశం లభించడమే కాకుండా, 5,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరకనుంది. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కోరినట్లుగా... ఈ ప్రాజెక్ట్ పూర్తి కాగానే ఇక్కడకు మరో రూ.50 కోట్లతో అదనపు హంగులు తీసుకువచ్చే బాధ్యత తనదేనని మంత్రి హామీ ఇచ్చారు.

గత పాలనలో కబ్జాలు.. మా హయాంలో అభివృద్ధి: 

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘గత పాలకులు చేపపిల్లలను చూపించి, చెరువుల్లో మట్టిని అమ్ముకు న్నారు. భూములను కబ్జా చేశారు. కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం రూ.200 కోట్ల విలువైన 13 ఎకరాల ప్రభుత్వ భూమిని మత్స్యకారుల కోసం కేటాయించింది.

ఇదే మా చిత్తశుద్ధికి నిదర్శనం‘ అన్నారు. విజయవాడ జాతీయ రహదారి, సాగర్ రోడ్, ఓఆర్‌ఆర్లకు సమీపంలో ఉండటం వల్ల కోహెడ మార్కెట్ ము దిరాజ్, బెస్త వర్గాల ఆర్థిక స్థితిగతులను మా ర్చేయబోతోందని ఆశాభావం వ్యక్తం చేశా రు. రెండున్నరేళ్లలోనే నియోజకవర్గాన్ని వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

మత్స్యకారుల అభివృద్ధికి మైలురాయి: 

భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, బ్లూ రివల్యూషన్ (నీలి విప్లవం) లక్ష్యాలను సాకారం చేస్తూ మత్స్యకారులకు ఆధునిక మార్కెటింగ్ సౌకర్యాలు, గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రైతు, కార్మిక, మత్స్యకార, విద్యార్థి వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగుతోందన్నారు.

మంత్రి పర్యటనలో నిరసన సెగ.. ఆందోళనకారుల అరెస్ట్..

ఒకవైపు శంకుస్థాపన సంబరాలు జరుగుతుండగా, మరోవైపు మంత్రి వాకిటి శ్రీహరి పర్యటనలో నిరసన సెగ తగిలింది. తెలంగాణ మత్స్యకారుల సంఘం నాయకులు సభ ప్రాంతంలో ఆందోళనకు దిగారు. చేప, రొయ్య పిల్లల కొనుగోలు కోసం మత్స్య సొసైటీల ఖాతాల్లో నేరుగా నగదు జమ చే యాలని.. డిమాండ్ చేశారు.

నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని అరె స్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ డైరెక్టర్ నిఖిల, గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్ మధుసూధన్ రెడ్డి, వైస్ చైర్మన్ భాస్కరాచారి, రంగారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.