30 March, 2026 | 1:39 PM

Breaking News

మోకిలాలో డ్రగ్ రాకెట్ భగ్నం— నిందితుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్   •   నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. ఆయన తల్లి కన్నుమూత   •   శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యుల సస్పెన్షన్   •   అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. సురక్షితంగా బయటపడిన 16 కుటుంబాలు   •   మాజీ ఎమ్మెల్యే మర్రి అభిమానులపై కేసు నమోదు   •   మైనింగ్‌పై దద్దరిల్లిన శాసనసభ బీఆర్‌ఎస్ సభ్యుల సస్పెన్షన్   •   మీ తాతలు దిగొచ్చినా పొంగులేటి రాజీనామా చేయరు   •   కన్నోళ్లకు భరోసా   •   ఆంధ్రోళ్ల చేతికి ఆర్టీసీ!   •   పశ్చిమాసియాలో భూతల యుద్ధం దగ్గరపడింది: అమెరికా 7,000 సైనికులు మోహరింపు, ఇరాన్ 10 లక్షల సైన్యం సిద్ధం   •  

గోదావరి పుష్కరాలపై 20 రోజుల్లో నివేదికివ్వండి

30-03-2026 12:19 AM
  1. 2027 జూన్ నాటికి పనులు పూర్తిచేయాలి 

ఆలయాలు, పర్యాటక ప్రాంతాల్లో ఘాట్ల విస్తరణపై దృష్టి పెట్టాలి 

పుష్కరాలు, బాసర ఆలయాభివృద్ధి మాస్టర్ ప్లాన్‌పై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, మార్చి 29 (విజయక్రాం తి): గోదావరి పుష్కరాలను ప్రతిష్ఠాత్మంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైం ది. ఈ మేరకు పుష్కరాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాలు, ఘాట్ల అభివృద్ధిపై స మావేశంలో చర్చించారు. 2027 జూన్‌నాటికి పనులు పూర్తిచేయాలని సీఎం ఆదేశిం చారు. ఈ సందర్భంగా పుష్కర ప్రణాళికలపై సీఎంకు అధికారులు వివరించారు. టెక్నికల్ ఇంజినీర్ల కమిటీ ఏర్పాటుకు సీఎం ఆదేశించారు.

క్షేత్రస్థాయిలో కమిటీ పర్యటించి 15- లేదా 20 రోజుల్లో నివేదిక సమర్పించాలని, పూర్తి నివేదికను క్యాబినెట్ సబ్ కమిటీకి పంపించాలన్నారు. క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదం తర్వాత క్యాబినెట్‌లో తుది నిర్ణ యం తీసుకుంటామని చెప్పారు. శాశ్వత, తా త్కాలిక పనులను ప్రాధాన్యతలవారీగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజాభవన్‌లో వార్ రూమ్ ఏర్పాటుచేయాలని ఆదేశించారు.

ఆలయాలు, పర్యాటక ప్రాంతాల్లో ఘాట్ల విస్తరణపై దృష్టి సారించాలని సూ చించారు. ఆలయాలు, పర్యాటక ప్రాంతాల్లో ఘాట్ల విస్తరణ, రోడ్లు, కనెక్టివిటీ సమస్యలు లేకుండా చర్యలకు పలు సూచనలుచేశారు. బాసర ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్‌పై సీఎం సమీక్షించారు. ఆలయ విస్తరణపై అధికారులకు కీలక సూచనలుచేశారు.

సమీక్షలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, సీఎం ప్రిన్సి పల్ సెక్రటరీలు శేషాద్రి, శ్రీనివాసరాజు, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డీజీపీ శివధర్‌రెడ్డి పాల్గొన్నారు.