30 March, 2026 | 12:06 PM

Breaking News

మోకిలాలో డ్రగ్ రాకెట్ భగ్నం— నిందితుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్   •   నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. ఆయన తల్లి కన్నుమూత   •   శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యుల సస్పెన్షన్   •   అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. సురక్షితంగా బయటపడిన 16 కుటుంబాలు   •   మాజీ ఎమ్మెల్యే మర్రి అభిమానులపై కేసు నమోదు   •   మైనింగ్‌పై దద్దరిల్లిన శాసనసభ బీఆర్‌ఎస్ సభ్యుల సస్పెన్షన్   •   మీ తాతలు దిగొచ్చినా పొంగులేటి రాజీనామా చేయరు   •   కన్నోళ్లకు భరోసా   •   ఆంధ్రోళ్ల చేతికి ఆర్టీసీ!   •   పశ్చిమాసియాలో భూతల యుద్ధం దగ్గరపడింది: అమెరికా 7,000 సైనికులు మోహరింపు, ఇరాన్ 10 లక్షల సైన్యం సిద్ధం   •  

కొండగట్టుకు పాదయాత్రగా బయలుదేరిన అంజన్న స్వాములు

30-03-2026 12:19 AM

చేగుంట, మార్చి 29 : జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రంమైన కొండగట్టు అంజన్నఆశీర్వాద మహా పాదయాత్ర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. చేగుంట లోని చందాయిపేట్ గురు స్వామి ఆధ్వర్యంలో వంద లాది మంది హనుమాన్ దీక్షాపరులు, భక్తులు చందాయిపేట్ నుండి కొండగట్టు వరకు ఎండను సైతం లెక్కచేయకుండా పాదయాత్రగా బయలుదేరారు.

ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ... కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం, తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం, ముత్యంపేట గ్రామానికి దాదాపు 3.5 కి.మీ.లు దూరంలో ఉన్న ఒక ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్నదని, ఇది జగిత్యాల జిల్లా నుండి 15 కి.మీ. దూరములో కొండలు, లోయలు, సెలయేరుల మధ్యన కొండగట్టు దేవాలయం ఉన్నదని, ఇది చాలా ప్రకృతి సౌందర్యము కలిగిన ప్రదేశముఅని అన్నారు,జానపదాల ప్రకారము, ఈ గుడిలో 41 రోజుల పాటు పూజ చేస్తే సంతానము లేని వారికి సంతానము కలుగుతుందని భక్తుల నమ్మకము అని వారు అన్నారు.