30 March, 2026 | 12:12 PM

Breaking News

మోకిలాలో డ్రగ్ రాకెట్ భగ్నం— నిందితుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్   •   నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. ఆయన తల్లి కన్నుమూత   •   శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యుల సస్పెన్షన్   •   అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. సురక్షితంగా బయటపడిన 16 కుటుంబాలు   •   మాజీ ఎమ్మెల్యే మర్రి అభిమానులపై కేసు నమోదు   •   మైనింగ్‌పై దద్దరిల్లిన శాసనసభ బీఆర్‌ఎస్ సభ్యుల సస్పెన్షన్   •   మీ తాతలు దిగొచ్చినా పొంగులేటి రాజీనామా చేయరు   •   కన్నోళ్లకు భరోసా   •   ఆంధ్రోళ్ల చేతికి ఆర్టీసీ!   •   పశ్చిమాసియాలో భూతల యుద్ధం దగ్గరపడింది: అమెరికా 7,000 సైనికులు మోహరింపు, ఇరాన్ 10 లక్షల సైన్యం సిద్ధం   •  

మాజీ ఎమ్మెల్యే మర్రి అభిమానులపై కేసు నమోదు

30-03-2026 10:53 AM

శాంతి భద్రతలకు విఘతం కలిగేలా అత్యుత్సాహం.

ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యేలా ప్రవర్తించారని మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు. 

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి(Former MLA Marri Janardhan Reddy) జన్మదిన వేడుకల సందర్బంగా ఎలాంటి అనుమతులు లేకుండా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అయ్యేలా శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ప్రవర్తించిన బీఆర్ఎస్ నాయకులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసినట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు.

పట్టణంలోని ప్రధాన రహదారి ఎలెక్ట్రిక్ పోల్స్ పైన  ఫైర్ క్రాకర్ లను అమర్చి కాల్చి పబ్లిక్ ప్రాపర్టీకి నష్టం కలిగే విధంగా ప్రవర్తించరని పేర్కొన్నారు. అందుకు కారణమైన ప్రవీణ్, వెంకటేష్, మాజీ కౌన్సిలర్ భాస్కర్ గౌడ్ లపై చర్యలు తీసుకోవాలని పిర్యాదులో పేర్కొన్నారు. రోడ్డును బ్లాక్ చేసి ప్రజా రవాణాకు భంగం కలిగించి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన విష్ణు, నరసింహ,రెండో వార్డు కౌన్సిలర్ తిమ్మాజిపేట పాండు, మాజీ కౌన్సిలర్ భాస్కర్ గౌడ్, మాజీ జెడ్పిటిసి శ్రీశైలం, ఇంద్రకల్ రమణతో పాటు ప్రమాద భరితంగా క్రాకర్స్ పేల్చిన వ్యక్తులపై మరికొందరి పైన కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.