విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలి: ఎమ్మెల్యే బిఎల్ఆర్
ఉప్పల్,(విజయక్రాంతి): త్వరలో జరగబోయే పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం రోజున ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం డివిజన్లో గ్రేటర్ హైదరాబాద్ సాయిజెన్ శేఖర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షకు కావలసిన సామాగ్రిని విద్యార్థులకు ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో మంచి ఉత్తీర్త సాధించి తల్లిదండ్రులకు పాఠశాల గురువులకు పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. బాగా చదువుకొని ఎంబిబిఎస్ ర్యాంక్ కనుక సాధిస్తే ఐదు సంవత్సరాల ఫీజును తానే చెల్లిస్తానని ఇప్పటికే సుమారు 200 మంది విద్యార్థులకు ఫీజులు చెల్లించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాచారం బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు




