9 May, 2026 | 9:16 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం

09-05-2026 08:18 PM

- ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

చొప్పదండి,(విజయక్రాంతి): చొప్పదండి నియోజకవర్గంలోని కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకు వచ్చిన రైతులు  ఆందోళనకు గురికావద్దని, రైతులు తీసుకువచ్చిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భరోసా ఇచ్చారు. గంగాధర మండలం మధురానగర్ లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి ధాన్యం కొనుగోళ్ల తీరు,  సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన జిపిఎస్ సిస్టంతో ధాన్యం కొనుగోలు వారం రోజులు ఆలస్యం అయినట్లు తెలిపారు. 

నియోజకవర్గంలోని కొనుగోలు కేంద్రాలపై నిత్యం పర్యవేక్షణ చేస్తున్నట్లు, జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులతో మాట్లాడి రైతులు ఇబ్బంది పడకుండా  చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కొన్ని కేంద్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ తూకం వేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని, నిబంధన మేరకే ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి  లారీలను పంపించాలని కలెక్టర్ ను కోరారు. కొనుగోలు చేసిన ధాన్యం తీసుకోకుండా మిల్లర్లు ఇబ్బంది పెడితే  కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు ఎదురైతే  తమ దృష్టికి తీసుకురావాలని రైతులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వేముల భాస్కర్, పడాల రాజన్న, తూం రాజు, వేముల అంజి, సాగి అజయ్ రావు, మంత్రి మహేందర్, దాతు అంజి తదితరులు పాల్గొన్నారు.