చంద్రoపేట పాఠశాల విద్యార్థులకి నగదు బహుమతి అందజేత
500 మార్కులు పైన వచ్చిన 16మంది విద్యార్థులకు 3000రూపాయలు
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సిరిసిల్ల అర్బన్ చంద్రంపేట ఉన్నత పాఠశాల విద్యార్థులను శనివారాం రోజున వెంకట్ ఫౌండేషన్ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో కరీంనగర్ లో ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా సన్మానించారు. 500 పైగ మార్కులు సాధించిన చంద్రంపేట ఉన్నత పాఠశాలకు చెందిన 16 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి మూడు వేల రూపాయల నగదు బహుమతితో పాటు బంగారు పతకం మరియు జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కైరి పద్మ, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ కంది సుజాత, ఉపాధ్యాయ బృందం,గ్రామ ప్రజలు, విద్యార్థుల తల్లితండ్రులు వెంకట్ ఫౌండేషన్ కరీంనగర్ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు.






