న్యాయవాద వృత్తిలో విద్యార్థులు రాణించాలి
- డీజీపీ శివధర్‌రెడ్డి
ఓయూ లా కళాశాలలో డుసీమస్ ఉత్సవాలు
సికింద్రాబాద్, ఏప్రిల్01(విజయక్రాంతి): న్యాయవాద వృత్తిని ఎంచుకున్న విద్యార్థులు గొప్ప స్థాయికి ఎదగాలని, అందుకు పట్టుదలగా చదివి పట్టా సాధించడంతో పాటు వృత్తి నైపుణ్యాలపై కూడా పట్టు సాధించా లని తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి సూచించారు. ఓయూలో నిర్వహిస్తున్న డుసీమస్ వేడులకు డీజీపీ శివధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యా రు.
ఈ సందర్బంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ తాను 30ఏళ్ల క్రితం ఓయూ లా కళాశాలలో ఎల్‌ఎల్బీ చదివానని,చాలా ఏళ్ల తరువాత కాలేజీలో నిర్వహించే వేడుకలకు వచ్చానని తెలంగాణ డీజీపీ బి.శివధర్ రెడ్డి అన్నారు . ఇక్కడ చదివి, ఇదే కళాశాలలో జరిగే వేడుకలకు మళ్లీ రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. అప్పటి తన విద్యార్థి జీవితం, ఓయూ క్యాంపస్ తో తన కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, కాలేజీ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు లేక వేడుకలు వెలవెల...
13 ఏళ్లుగా ఓయూ లా కళాశాలలో నిర్వహిస్తున్న డుసీమస్ వేడుకలు ఈ సారి మాత్రం చాలా నామమాత్రంగా ఉన్నాయి. మొదటి రోజే విద్యార్థులు లేక ఉత్సవాలు పేళవంగాకనిపించాయి. నిర్వహణ లోపాలు కొట్టోచ్చినట్లు కనిపిస్తున్నాయి. రెండో రోజు అయినా ముందస్తుగా ప్రకటించిన విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని విద్యార్థులు కోరుతున్నారు.




