2 April, 2026 | 3:21 AM

కోనరావుపేట పీహెచ్‌సీలో పాములు

02-04-2026 01:14 AM

సదుపాయాల లేమితో రోగుల ఆందోళన

కోనరావుపేట, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): కోనరావుపేటలోని పీహెచ్‌సీ బుధవారం పాము ప్రవేశించడం కలకలం రేపింది. దీంతో సిబ్బంది, రోగులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు పామును చంపే యడం తో ప్రమాదం తప్పింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రహరీ లేకపోవడం, పరిసరాల్లో చెత్త, పిచ్చి మొక్కలు విస్తరించడం వల్ల తరచూ పాములు వస్తున్నాయని సిబ్బంది, రోగులు తెలిపారు.

కాగా పాము కాటు వంటి అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన యాంటీ వెనం (విష నివారణ మం దు) అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోం ది. బుధవారం నిమ్మపెల్లికి చెందిన ఒక వ్యక్తిని పా ము కాటేయగా.. కోనరావుపేట పీహెచ్‌సీలో చికిత్స అందించలేక అంబులెన్స్ ద్వారా ఏరియా ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది.