16 May, 2026 | 10:50 PM

విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి

16-05-2026 09:57 PM

- కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,(విజయక్రాంతి):  విద్యార్థులు విద్యతోపాటు అన్ని రంగాలలో రాణించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యా వారోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన కళలు, హస్త కళలు, సాంస్కృతిక దినోత్సవ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ యాదయ్యతో కలిసి హాజరై మాట్లాడారు. కోలాటం, తోలుబొమ్మలాట, బొమ్మల ప్రదర్శన, పేరిణి శివతాండవం, ఒగ్గు కథ, లంబాడి/ఆదివాసి నృత్యం, చిత్రలేఖనం, హస్తకళలు వంటి అంశాలలో విద్యార్థులు ఆసక్తి కలిగి ఉండాలని, కళలతో పాటు క్రీడా రంగంలో రాణించాలన్నారు. వివిధ రంగాలలో నైపుణ్యత సాధించడం ద్వారా నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ అలవడతాయని, టీం వర్క్ పై అవగాహన కలుగుతుందని తెలిపారు. ఏ రంగంలో అయినా గెలుపు, ఓటములు ముఖ్యం కాదని ప్రయత్నించడం మొదటి విజయమని తెలిపారు.