11 August, 2026 | 11:11 AM

మాదిగ జాతిని కించపరిచిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి: నిట్టూరి శ్రీశైలం

11-08-2026 09:53 AM

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎమ్మార్పీఎస్ నాయకులు నెట్టూరి శ్రీశైలం ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఏఎంసి మాజీ చైర్మన్ గడవేణి మల్లేష్ యాదవ్ చర్వాలో తన మిత్రులతో మాట్లాడుతూ మాదిగ జాతిని ఉద్దేశించి కించపరిచే విధంగా, అసభ్య పదజాలం ఉపయోగించారని ఎమ్మార్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆరోపించింది. ఈ మేరకు సిర్పూర్ టీ తాలూక్ ఇంచార్జ్ నిట్టూరి శైలం మాదిగ ఎస్ఐకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ఫిర్యాదులో ఆయన మాట్లాడుతూ... "మాదిగ జాతి మాకు ఓటు వేయలేదు, వేయరు కూడా" అంటూ మాదిగ జాతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడారని తెలిపారు. ఇది SC/ST అట్రాసిటీ చట్టం కిందకు వస్తుందని, వెంటనే గడవేణి మల్లేష్ యాదవ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.