16 May, 2026 | 10:49 PM

నూతన డ్రైనేజీ నిర్మాణానికి భూమిపూజ

16-05-2026 09:59 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండలంలోని వెంకట్రావుపేట్ గ్రామంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. గ్రామంలోని 1వ వార్డులో నూతన డ్రైనేజీ నిర్మాణానికి శనివారం భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించినట్లు సర్పంచ్ కనుముల వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా డ్రైనేజీ సౌకర్యం లేక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా నూతన డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. డ్రైనేజీ నిర్మాణానికి భూమిపూజ జరగడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తోట గంగారెడ్డి, కార్యదర్శి వేల్పుల సురేష్, వార్డు సభ్యులు బ్రమారౌతు దీపిక, కిరణ్, గ్రామ నాయకులు तथा స్థానికులు పాల్గొన్నారు.