మోదీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ భారీ రాస్తారోకో
- జైల్ భరో సక్సెస్
గుండాల,(విజయక్రాంతి): మోదీ ప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు ఈసం వెంకటమ్మ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు ఊకే వెంకటేశ్వర్లు, తోలెం గోపి, సీఐటీయూ మండల నాయకులు తోలెం భూపాల్, రైతు కూలీ సంఘం మండల అధ్యక్షులు గడ్డం లాలయ్య, సిపిఐ నాయకులు సాహెబ్ డిమాండ్ చేశారు.
సోమవారం కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మండల కేంద్రంలో సీఐటీయూ, రైతు కూలీ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పాయం సారక్క అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడుతూ.. పరాయి పాలన పోవాలని క్విట్ ఇండియా ఉద్యమం జరిగిందని, నేడు మోధీ ప్రభుత్వం కార్పోరేట్లతో కలిసి కార్మికులకు, రైతులకు, దేశ ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్న పాలన పోవాలని జైల్ భరో కార్యక్రమం దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు.
కార్పోరేట్ల ప్రయోజనం కోసం ఏకపక్షంగా మోధీ ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్చిందన్నారు. నాలుగు లేబర్ కోడులను తెచ్చి కార్మికుల హక్కులు కాలరాసిందన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం కోసం విదేశాలతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మహాత్మాగాందీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, వీబీజీరామ్ జి చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నూతన విత్తన, విద్యుత్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరల చట్టం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ వజ్జ సుశీల, కొడవటంచ ఉపసర్పంచ్ జోగ రాజేష్, సాయనపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ దుగ్గి రామ్మూర్తి , మండల కమిటీ సభ్యులు వాగబోయిన నర్సింహారావు, కల్తి శేఖర్ షేక్ జాన్ పాషా, మొక్క రాజు, దుగ్గి లక్ష్మయ్య, జబ్బ ఆదిలక్ష్మి, వినోద, తోలెం లక్ష్మి, శకుంతల, మిడ్ డే మీల్స్ వర్కర్స్ యూనియన్ పొలెబోయిన లక్ష్మి, వట్టం రామక్క, సరోజినీ, పూనెం కోమల, విజయ, సావిత్రి, సరిత, రమాదేవి, నీలిమ, కౌసల్య, సుశీల, కళావతి, సుమలత, సుజాత సత్యక్క తదితరులు పాల్గొన్నారు.






