19-02-2026 05:37:25 PM
ఏడి ఇండస్ట్రీస్ ప్రత్యేక అధికారి వై రామ సుబ్బారెడ్డి.
బోధన్ : సాలూర మండలంలో ఏడి ఇండస్ట్రీస్ మండల ప్రత్యేక అధికారి వై.రామసుబ్బారెడ్డి ,మండల ఎంపీడీవో శ్రీనివాస్ తో కలిసి గురువారం అకస్మికంగా పర్యటించారు.బోధన్ పట్టణం ఆచన్ పల్లిలో గల సాలూర మండల పరిధికి చెందిన మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలను సందర్శించారు.పాఠశాలలో ఉన్నటువంటి సౌకర్యాలను ఉపాధ్యాయులు,విద్యార్థులకు అడిగి తెలుసుకున్నారు. అనంతరం భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకునాణ్యమైన భోజనాన్ని అందించాలని ఆదేశించారు.అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని తెలిపారు.
సౌకర్యాల విషయంలో లోటుపాట్లు ఉండకూడదని ఆదేశించారు.అనంతరం సాలూర మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించారు.మధ్యాహ్న భోజనం మరియు పాఠశాలకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. పాఠశాల విద్యార్థులతో మధ్యాహ్న భోజనం చేశారు.స్ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు.ఆసుపత్రిలో సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ఉన్నటువంటి సౌకర్యాలు గురించి మండల మెడికల్ ఆఫీసర్ రాజ్ కుమార్ కు అడిగి తెలుసుకున్నారు.
అన్ని సౌకర్యాలు సమకూర్చుకొని వస్తున్నటువంటి రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని ఆదేశించారు. భవిష్యత్తులోఎలాంటి ఫిర్యాదులు రాకుండా జాగ్రత్తగా బాధ్యతలు నిర్వహించాలని అన్నారు.అనంతరం మండలంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు.ఇందిరమ్మ లబ్ధిదారులకు బిల్లులు సకాలంలో చెల్లిస్తున్నారా లేదా అంటూ మండల ఎంపీడీవోని అడిగి తెలుసుకున్నారు.దశలవారీగా బిల్లులను అందిస్తున్నట్లు ఎంపీడీవో ప్రత్యేక అధికారికి వివరించారు.ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.దశలవారీగా బిల్లులు తప్పనిసరిగా చెల్లిస్తారని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రాజీ మంజూష,గ్రామపంచాయతీ ఇంచార్జ్ సెక్రటరీ,హౌసింగ్ ఏఈ ఉన్నారు.