calender_icon.png 19 February, 2026 | 7:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం కప్ సాప్ట్ బాల్ పోటీలకు గట్లమల్యాల విద్యార్థులు

19-02-2026 05:35:53 PM

నంగునూరు: మండల పరిధిలోని గట్లమల్యాల జడ్.పి.హెచ్.ఎస్ విద్యార్థులు రాష్ట్రస్థాయి సీఎం కప్ సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికైనట్లు  ప్రధానోపాధ్యాయులు ఎం.రమేష్ తెలిపారు.ఈ నెల 13 న జిల్లా స్థాయిలో జరిగిన పోటీల్లో పాఠశాలకు చెందిన కె. మనిశరణ్, బి. ఈశ్వరి,ఎం. వైష్ణవి, బి. హరిణి ప్రియ లు ఈ నెల 20 నుండి 23 వరకు మెదక్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులను తీర్చిదిద్దిన  వ్యాయామ ఉపాధ్యాయుడు డి. రాజ్ కుమార్ ను సర్పంచ్ ఇంగే నరేష్,ఉప సర్పంచ్ శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం గ్రామస్తులు అభినందించారు.