24 April, 2026 | 12:20 PM

Breaking News

BJP కార్యాలయానికి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి.. త్వరలోనే బీజేపీలోకి?   •   అడవికి వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్రగాయాలు   •   కోనరావుపేటలో ఘనంగా పీఎం శ్రీ ఎంపీపీ ఎస్ ప్రైమరీ స్కూల్ 2వ వార్షికోత్సవం – గ్రాడ్యుయేషన్ డే వేడుకలు   •   కమిటీల పేరుతో కాలయాపన: 900 రోజులైనా— హామీల అమలు ఏమైంది?   •   సివిల్ ఇంజినీర్స్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం   •   రోడ్లపైకి ఆర్టీసీ కార్మికులు..!   •   అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం   •   చర్చలు ప్రారంభం.. హామీలు అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్   •   ఆవేశంలో అఘాయిత్యాలకు పాల్పడవద్దు.. ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి   •   సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు: RTC డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల మహేష్ గౌడ్ దిగ్భ్రాంతి   •  

చత్రపతి శివాజీ జయంతి వేడుకలు

19-02-2026 05:38 PM

నిర్మల్ ఫిబ్రవరి 19 ( విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ జయంతి వేడుకలను గురువారం నిర్వహించారు. మంచిర్యాల చౌరస్తా వద్ద శివాజీ విగ్రహానికి మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి పూలమాలవేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షాహాజీ పూణేలో తన జాగీరు వ్యవహారాలను తన భార్యకు అప్పగించి యువకుడైన శివాజీకి రాజనీతి వ్యవహారాలు నేర్పడానికి ముఖ్య అనుచరులతో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తాను బెంగుళూరు జాగీరుకు వెళ్ళాడన్నారు. అప్పటి నుండి శివాజీ తల్లి అతనికి పుట్టిన భూమి పైన, ప్రజల పైన ప్రేమ కలుగలీగే విదంగా విద్యాబుద్ధులు నేర్పారనితేలిపారు. శివాజినీ ప్రజల రక్షణ కొరకు పాటు పడేలా తీర్చిదిద్దారని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్,కౌన్సిలర్లు ఎస్పి రాజు, గోపు గోపి, పెండం శ్రీనివాస్, లక్కాకుల హరీష్, కత్తి నరేందర్ తదితరులు పాల్గొన్నారు.