16 June, 2026 | 8:13 PM

విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి

16-06-2026 07:08 PM

* నాగిరెడ్డిగూడ గ్రామ సర్పంచ్ కీసరి పద్మా సంజీవరెడ్డి 

* నాగిరెడ్డిగూడ గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం

మొయినాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అర్హత కలిగిన ఉపాధ్యాయులచే విద్యా బోధన నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నాగిరెడ్డిగూడ గ్రామ సర్పంచ్ కీసరి పద్మా సంజీవరెడ్డి సూచించారు. మంగళవారం మొయినాబాద్ మండల పరిధిలోని నాగిరెడ్డిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కీసరి పద్మా సంజీవరెడ్డి, ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి గ్రామంలోని ప్రతి వీధిలో పర్యటించారు.

అనంతరం గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అర్హత కలిగిన ఉపాధ్యాయులచే విద్యా బోధన నిర్వహించడం జరుగుతుందని అన్నారు. చిన్నారులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎర్ర జైపాల్, వార్డు సభ్యులు హేమలత అర్జున్, వనజా కుమార్, యాదగిరి, రాజు, నిరోషా వికాస్, విజయ్ రాజ్, మధుకర్, రోజా మహేందర్, శశిధర్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.