ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
- సర్పంచ్ సంపూర్ణ రాములు
మొయినాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్నదే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమని మోత్కుపల్లి గ్రామ సర్పంచ్ సంపూర్ణ రాములు అన్నారు. మొయినాబాద్ మండల పరిధిలోని మోత్కుపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ సంపూర్ణ రాములు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోందన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని విద్యలో రాణించాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాల కల్పనలో గ్రామపంచాయతీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.






