విద్యార్థులు పీజీ ఎంట్రన్స్‌లో ర్యాంకులు సాధించాలి
నల్లగొండ టౌన్, ఫిబ్రవరి 26: విద్యార్థులు పీ జీ ఎంట్రన్స్ లో ఉత్తమ ఫలితాలు సాధించాలని స్థానిక మహిళ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరాజు అన్నారు గురువారం స్థానిక మహిళా డిగ్రీ కళాశాలలోజువాలజీ విభాగం ఆధ్వర్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రెన్స్2026 జువాలజీ ఉచిత కోచింగ్‌ను ప్రారంభించారు ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, ఈ ఉచిత కోచింగ్ను విద్యార్థినులు సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యలో మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.
డాక్టర్ సుంకరి రాజారామ్ మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో ఉన్నత విద్యకు, ముఖ్యంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువులకు, కోచింగ్ ఎంతో అవసరమైనదని, ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉన్న అనేక మంది విద్యార్థులకు ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల ఫీజులు భరించడం కష్టంగా మారుతున్న సందర్భంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫ్రీ కోచింగ్ సెంటర్ స్థాపించడం ఒక గొప్ప సేవా కార్యక్రమం అని తెలిపారు.
జువాలజీ విభాగాధిపతి డా. సి.హెచ్. సమత మాట్లాడుతూ, పేద గ్రామీణ ప్రాంతవిద్యార్థినులకు ఉచిత కోచింగ్ అందించడం తమ విభాగానికి ఎంతో సంతోషకరమైన విషయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో డా. కె. వనజ , డా. మిస్కిన్, డా. ఎం. మల్లేశ్, సి.హెచ్. సంతోష్ కుమార్, ఎం. వైష్ణవి పాల్గొన్నారు.




