కార్యకర్త కుటుంబానికి అండగా తెలుగుదేశం పార్టీ
టీడీపీ సభ్యత్వ బీమా రూ. 5 లక్షలు అందజేత
కోదాడ,(విజయక్రాంతి): తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని రాష్ట్ర నాయకులు ముత్తినేని సైదేశ్వరరావు, ఓరుగంటి ప్రభాకర్ లు తెలిపారు. శనివారం కోదాడ పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త గుండెపురి ఉపేందర్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పుట్టెడు కష్టాల్లో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు తెలుగుదేశం పార్టీ తక్షణమే చొరవ తీసుకుంది. ఉపేందర్ కు నాడు తెలుగుదేశం పార్టీలో ఉన్న అవార్డు నాయకుడు ఉప్పగండ్ల శ్రీనివాస్ ద్వారా పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. పార్టీ సభ్యత్వం కలిగి ఉండటంతో, ఇన్సూరెన్స్ ద్వారా మంజూరైన రూ.5 లక్షల నగదును ఆయన భార్య నాగమణి బ్యాంకు ఖాతాలో జమ చేశారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించిన పార్టీ నాయకులు ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు.
ఈ కార్యక్రమంలో కొల్లు నర్సయ్య, దొడ్డ గురవయ్య,కోడె వాసు,కట్టా సతీష్,కాంగ్రెస్ పార్టీ 18వ వార్డు ఇంచార్జ్ ఉప్పుగండ్ల శ్రీనివాసరావు,మట్టపల్లి నాగేశ్వరరావు,ఇరిగెల ప్రకాష్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ మండల పార్టీ నాయకులు చాపల శ్రీనివాసరావు,కొల్లు సత్యనారాయణ, పిట్టల శోభన్ బాబు,చావ హరినాథ్, ముత్తవరపు శ్రీ వాత్సవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ బాబా షర్ఫుద్దీన్, బెక్కం సీతారాములు,మల్లు జగన్నాథ్ రెడ్డి, వనపర్తి నాగేశ్వరావు,చింతల కొండలు,రవీందర్ రెడ్డి, జమ్మల శ్రీనివాసరావు,మహమ్మద్ యాసిన్,బండ్లమూడి వెంకటేశ్వరావు,మాదాల రాంబాబు,అశోక్ కుమార్, బత్తినేని రవీంద్ర,నర్రా రమేష్,వెంకట నరసమ్మ, రేవంత్ కనగాల వీరబ్రహ్మం,గౌని శ్రీనివాస్ గౌడ్, దొడ్డనిఖిల్ తదితరులు పాల్గొన్నారు.






