1 August, 2026 | 8:38 PM

ఎదురెదురుగా రెండు బైకులు ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు

01-08-2026 07:35 PM

ఆళ్ళపల్లి,(విజయక్రాంతి): మండల పరిధిలోని, రాయిపాడు మార్గమధ్యంలో రెండు బైకుల ఢీకొని  ఒకరికి తీవ్ర గాయాల పాలైన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కిన్నెరసాని వంతెన వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ఘటనలో టేకులపల్లి మండలం కోయగూడెం గ్రామానికి చెందిన ఎ. కార్తీక్ ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు గమనించి వె 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స అందించి, ఆళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.