1 August, 2026 | 8:38 PM

సిద్ధార్థ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా వన మహోత్సవం

01-08-2026 07:28 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నర్సయ్యపల్లిలోని సిద్ధార్థ విద్యాసంస్థల ఆధ్వర్యంలో శనివారం వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా  విద్యాసంస్థల అధినేత దాసరి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ... వనాలు పెంచే ఉద్దేశంతో సమూహంగా అధిక సంఖ్యలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వనమహోత్సవం అంటారని అన్నారు.

మానవుని మనుగడకు అవసరమైన వాటిలో అతి ముఖ్యమైనవి చెట్లు, చెట్ల యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని పెంచేలా ప్రోత్సహిస్తూ ఈ వనమహోత్సవాన్ని చేపడుతారని అన్నారు. దాసరి శ్రీపాల్ రెడ్డివిద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతో దోహదపడతాయని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు.