1 August, 2026 | 8:56 PM

జర్నలిస్టుల సన్మానం

01-08-2026 07:56 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ, నాణ్యమైన వైద్య సేవలు అందించి మంచి గుర్తింపు పొందిన డాక్టర్ చంద్రశేఖర్  ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా నియమితులయ్యారు.

ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్‌ ను జర్నలిస్టులు ఘనంగా శాలువాతో సన్మానించి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కొత్త బాధ్యతల్లో కూడా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తూ విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అలాగే రైల్వే మజ్దూర్ యూనియన్ లో అంకితభావంతో పనిచేసే రాష్ట్రస్థాయి యూనియన్ జోనల్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా నియమితుడైన రైల్వే ఉద్యోగి ఆవుల యుగంధర్ యాదవ్ ను కూడా జర్నలిస్టులో సన్మానించారు.