రైల్వే కార్మికుల హక్కుల కోసం మజ్దూర్ యూనియన్ నిరంతరం పోరాటం
జోనల్ వర్కింగ్ కమిటీ సభ్యులు యుగంధర్ యాదవ్
వరంగల్,(విజయక్రాంతి): రైల్వే కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం మద్దూర్ యూనియన్ ముందుండి పోరాడుతుందని మజ్దూర్ యూనియన్ వరంగల్ బ్రాంచ్ సెక్రెటరీ ఆవుల యుగంధర్ యాదవ్ పేర్కొన్నారు. జోనల్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా నియామకం అయిన సందర్బంగా మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో యుగంధర్ యాదవ్ కి ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా అయన కార్మికులతో పలు సమస్యలపైన చర్చించారు. అనంతరం యుగంధర్ యాదవ్ మాట్లాడుతూ... రైల్వే కార్మికుల హక్కుల కోసం మజ్దూర్ యూనియన్ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు.
ఈ పదవికి తనను ఎంపిక చేసిన జోనల్ అధ్యక్షులు కాల్వ శ్రీనివాస్, జనరల్ సెక్రెటరీ శంకర్ రావు, సికింద్రాబాద్ డివిజనల్ సెక్రెటరీ రవీందర్ కు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో మజ్దూర్ యూనియన్ అసిస్టెంట్ సెక్రెటరీ రాజేష్, సురేష్, వైస్ చైర్మన్ సుధాకర్, రవీందర్, సుధాకర్, భాస్కర్, రాజేష్, చారి, కుండే రమేష్, అనిల్, శ్రీనివాస్, పాషా, సంపత్ రాజ్, కూమర్ తదితరులు పాల్గొన్నారు.






