15 May, 2026 | 1:24 AM

ప్రభుత్వ స్థలం పరిశీలించిన కలెక్టర్

15-05-2026 12:22 AM

కోర్టు కాంప్లెక్స్, డి ఆర్ కార్యాలయం, ట్రాఫిక్ పిఎస్ కు కేటాయింపు

మేడ్చల్, మే 14 (విజయ క్రాంతి): మేడ్చల్ మండలంలోని కండ్లకోయలో గల 135, 136 సర్వే నంబర్లలోని ప్రభుత్వ స్థలాన్ని గురువారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి పరిశీలించారు.   కోర్టు కాంప్లేక్స్, డిస్ట్రీక్ట్, సబ్ రిజిస్ట్రేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు కేటాయించడానికి 12 ఎకరాల స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోర్టు కాంప్లేక్సుకు గాను 5 ఎకరాలు,రిజిస్టరేషన్ ఆఫీసులకు 3 ఎకరాలు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు గాను 4 ఎకరాలు కేటాయించడం జరిగిందని అందుకు గాను స్థలాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. ల్యాండ్ డెవలప్ మెంట్ కు గాను టెండర్ పిలుస్తామన్నారు. ఈ పర్యటనలో కీసర ఆర్డిఓ రాజేష్ కుమార్, మేడ్చల్ ఎమ్మర్వో భూపాల్, మేడ్చల్ డిప్యూటి కమీషనర్ సుధాంశు,  తదితరులు పాల్గొన్నారు.