15 May, 2026 | 2:39 AM

ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి

15-05-2026 01:20 AM

కూసుమంచి, మే 14(విజయక్రాంతి): తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కూసుమంచి మండల విద్యాశాఖ అధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాయల వీరస్వామి పేర్కొన్నారు. కూసుమంచి మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో బడిబాట నడుస్తోంది. అందులో భాగంగా కూసుమంచి గ్రామంలో తల్లితండ్రులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్ధులతో సమావేశం జరిగింది.

మన పిల్లల భవిష్యత్తు కోసం ఉత్తమ ఎంపిక ప్రభుత్వ పాఠశాలలు అంటూ ర్యాలీ నిర్వహించారు. ఎంఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పాఠ్యపుస్తకాలు, దుస్తులు,  ఈ  సంవత్సరం నుంచి బ్రేక్ ఫాస్ట్ పౌష్టికాహారం కూడిన మధ్యాహ్న భోజనం అమ లు చేస్తుందన్నారు. తల్లిదండ్రులు మీ పిల్లలను కార్పొరేట్ పాఠశాలలో చేర్పించి నష్టపోవద్దన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిఆర్పిలు తదితరులు పాల్గొన్నారు.