calender_icon.png 20 February, 2026 | 7:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేగోడు కేజీబీవీ హాస్టల్లో 25 మంది విద్యార్థులకు అస్వస్థత

20-02-2026 06:39:58 PM

రేగోడు: మండల కేంద్రమైన రేగోడులోని కస్తూర్బా గాంధీ హాస్టల్లో శుక్రవారం ఉదయం 25 మంది విద్యార్థినులు అస్వస్థకు గురయ్యారు, మెదక్ జిల్లా రేగోడు మండల కేంద్రమైన రేగోడు లోని కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్లో ఉండి చదువుకునే 25 మంది విద్యార్థినిలు శుక్రవారం ఉదయం వాంతులు, విరోచనాలతో అస్వస్థకు గురయ్యారు. అస్వస్థకు గురైన విద్యార్థులకు రేగోడులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రి వైద్యులు అస్వస్థకు గురైన విద్యార్థులకు చికిత్సలు అందించారు, అందులో 15 మంది విద్యార్థులు నిలకడగా ఉండడంతో మరో 10 మందికి చికిత్సలు అందిస్తున్నారు, పదిమంది విద్యార్థులు కూడా కోలుకుంటున్నారని డాక్టర్ శ్వేత తెలిపారు, వాతావరణం కారణంగా కావచ్చని, చింతపండు పులుసు కారణంగానే విద్యార్థులు  అస్వస్థకు గురైనట్లు డాక్టర్ తెలిపారు.