9 May, 2026 | 11:26 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

సీసీఐ పత్తి కొనుగోలు గడువు పొడిగించాలి

20-02-2026 06:34 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో సీసీఐ పత్తి కొనుగోలు గడువు ముగియనుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దుర్గం దినకర్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టర్ కె.హరితకు వినతి పత్రం అందజేశారు. జిల్లాలో సుమారు 50 శాతం పత్తి ఇంకా రైతుల వద్దనే ఉందని, గడువు ముగిస్తే దళారుల చేతిలో రైతులు నష్టపోతారని హెచ్చరించారు. కాబట్టి పత్తి కొనుగోలు గడువును కనీసం మార్చి 30 వరకు పొడిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు గోడిసెల కార్తీక్, రాజేందర్, నిఖిల్ పాల్గొన్నారు.