న్యాయ అవగాహనతో హక్కులపై విద్యార్థులకు అవగాహన
నేరేడుచర్ల,(విజయక్రాంతి): జాతీయ న్యాయ సేవాధికార సంస్థ (నల్సా) ఆధ్వర్యంలో మండల న్యాయ సేవా కమిటీ, హుజూర్‌నగర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, నేరేడుచర్లలో శనివారం న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.కళాశాల ప్రిన్సిపాల్ నీరజ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి హుజూర్‌నగర్ సబ్‌కోర్టు సివిల్ న్యాయమూర్తి ఎన్. శ్యామ్ సుందర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు న్యాయ సేవలు, ప్రాథమిక హక్కులు, బాధ్యతలు, ఉచిత న్యాయ సహాయం, బాలల హక్కులు తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో హుజూర్‌నగర్ బార్ అసోసియేషన్ సెక్రటరీ, ఆర్వి రమణారెడ్డి, నేరేడుచర్ల ఎస్‌ఐ గోపాల్ రెడ్డి, లీగల్ ఎయిడ్ అడ్వకేట్ కాల్వ శ్రీనివాసులు,మరియు సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్, వనపర్తి శ్రీనివాసులు, స్టూడెంట్ కౌన్సిలర్ ఎం. గణేష్ లు మాట్లాడుతూ.... విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు, తమ హక్కులను తెలుసుకుని బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని న్యాయ అధికారులు సూచించారు.






