22 August, 2026 | 9:38 PM

ప్రిన్సిపాల్ హత్యకు ఖండన

22-08-2026 08:33 PM

పాఠశాల సిబ్బందికి భద్రత కల్పించాలి

నల్గొండ ఘటన నేపథ్యంలో ఇతర అధికారులను కలిసిన భూపాలపల్లి ట్రస్మా నాయకులు

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): నల్గొండ జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య ఘటనను భూపాలపల్లి ట్రస్మా సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రిన్సిపాల్స్, కరస్పాండెంట్స్, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి ప్రభుత్వం తగిన భద్రతా చర్యలు చేపట్టాలని శనివారం జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్ లతో పాటు ఇతర అధికారులను కలిసి వినతి పత్రం అందజేశారు.

పాఠశాలల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న యాజమాన్య ప్రతినిధులు, ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు భయాందోళనలకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో విధులు నిర్వహించేలా ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.నల్గొండ ఘటనను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల సిబ్బంది రక్షణకు అవసరమైన మార్గదర్శకాలు, భద్రతా చర్యలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని కోరారు.