22 August, 2026 | 9:40 PM

శంకర్‌ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం

22-08-2026 08:21 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి: మండలంలోని అంజనాపురం గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు సపావత్‌ శంకర్‌ ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. శంకర్‌ సతీమణికి రూ.లక్ష విలువైన చెక్కును ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిక్షం గౌడ్‌ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో పీఆర్టీయూ నాయకులు భూక్య రామారావు, చందుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.