ఎస్ఎల్ గౌడ్‌కు నివాళి అర్పించిన డిసిసి అధ్యక్షులు మేడిపల్లి సత్యం
ఎస్ఎల్ గౌడ్ మృతి తీవ్ర దిగ్భ్రాంతికరం
డా.మేడిపల్లి సత్యం
మానకొండూరు,(విజయక్రాంతి): మానకొండూర్ నియోజకవర్గం లోని తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదగోని లక్ష్మీ నారాయణ గౌడ్ (ఎస్ఎల్ గౌడ్) గుండెపోటుతో అకాల మరణం చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. శనివారం మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, పులి ఆంజనేయులు గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు బండారి రమేష్, గోపు మల్లారెడ్డి, శ్రీనివాస రావు, మామిడాల అనిల్, ఒగ్గు దామోదర్ తదితరులతో కలిసి వారి స్వగ్రామం మన్నెంపల్లిలోని వారి నివాసానికి వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఎన్ఎస్యుఐ నుండి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీకి సేవలు అందించడంతో పాటు సహకార సంఘం చైర్మన్ గా పదవి చేపట్టి ప్రజాసేవ చేసిన నాయకుడు ఎస్.ఎల్.గౌడ్ , కష్టకాలంలో పార్టీని వీడకుండా తన తుది శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీ కోసం విధేయతతో పనిచేసిన నిజమైన కాంగ్రెస్ సైనికుడిని కోల్పోవడం పార్టీకి తీరని లోటని అభిప్రాయపడ్డారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.






