22 August, 2026 | 10:26 PM

22-ఎ నిషేధిత జాబితా నుంచి రైతుల భూములను తొలగించాలి

22-08-2026 09:21 PM

తూప్రాన్ ఆర్డీఓకు వినతిపత్రం అందించిన బిజెపి నేతలు

తూప్రాన్,(విజయక్రాంతి): రైతుల భూములను 22-ఎ నిషేధిత జాబితా నుంచి తొలగించి, అర్హులైన రైతులకు భూమిపై పూర్తి హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతల ఆధ్వర్యంలో శనివారం తూప్రాన్ ఆర్డీఓ కార్యాలయం లో వినతి పత్రాన్ని ఆర్డిఓ బావయ్యకు సమర్పించారు. 22-ఎ నిషేధిత జాబితాలో ఉన్న అర్హత కలిగిన రైతుల భూములను జాబితా నుంచి తొలగించి, రైతులకు న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా జనరల్ సెక్రటరీ నత్తి మల్లేశ్, ముత్తురాజు మాట్లాడుతూ, 22-ఎ నిషేధిత జాబితా కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది రైతులు తమ భూములకు సంబంధించిన హక్కులను అనుభవించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే దీని తొలగించాలన్నారు. అర్హత కలిగిన రైతుల భూములను 22-ఎ జాబితా నుంచి తొలగించి వారికి పూర్తి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

రైతుల సమస్యలను పరిష్కరించే వరకు బీజేపీ తరఫున పోరాటం కొనసాగిస్తామని మున్సిపల్ అధ్యక్షులు భూమన్న గారి జానకిరామ్ గౌడ్ పేర్కొంటూ 22-ఎ నిబంధనల కారణంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లమని అన్నారు. తద్వారా ప్రభుత్వ ఉన్నత అధికారులు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, రైతుల హక్కుల పరిరక్షణ కోసం 22-ఎ నిషేధిత జాబితా సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని బీజేపీ నాయకులు తెలిపారు. ఇందులో తూప్రాన్ మండల బిజెపి అధ్యక్షులు పిట్ల పోచయ్య, జనరల్ సెక్రెటరీ సంపత్, రాజు, కిసాన్ మోర్చా సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి, తదితరులు ఉన్నారు.