30 June, 2026 | 9:35 PM

Breaking News

దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •   తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీనే... శ్రీరామరక్ష   •   రైతుల పాలిట శాపంగా మారిన యూరియా మొబైల్ యాప్: సనప విష్ణు   •   ఎఫ్‌పీఓలతో రైతులు ఆర్థికంగా బలోపేతం   •   పేదల ఇండ్ల సమస్యపై జులై 1న చలో కలెక్టరేట్   •   పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానించిన ఎస్పీ రోహిత్ రాజ్   •   జూన్‌లో 171 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిన మణుగూరు ఏరియా   •  

ఓయూ క్యాంపస్‌లో విద్యార్థుల ఆందోళన

13-02-2026 12:00 AM

ముషీరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాం తి): ఓయూ క్యాంపస్‌లో పీజీ చేస్తున్న ఓ విద్యార్థిని తల్లి తన కూతుర్ని చూడడానికి క్యాంపస్‌కి రావడంతో హాస్టల్ సిబ్బందిలోనికి వెళ్లడానికి  అనుమతిని ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన బుధవారం రాత్రి ఓయూ క్యాంపస్‌లో  చోటుచేసుకుంది.. విద్యార్థుల కథనం ప్రకారం.. మంచిర్యాలకు చెందిన ఓ విద్యార్థి ఓయూ క్యాంపస్‌లో పీజీ చేస్తుంది.

బుధవారం ఆ విద్యార్థిని తల్లి మంచిర్యాల నుంచి కూతురిని చూడడానికి ఓయూ క్యాంపస్‌కు వచ్చారు. సేయింటినరి లేడీస్ హాస్టల్ లోనికి వెళ్లి తన కూతుర్ని కలవాలని సెక్యూరిటీ గార్డ్‌ని అనుమతిని అడిగారు. దీంతో అనుమతి లేదంటూ సెక్యూరిటీ గార్డు నిరాకరించారు. విషయం తెలుసుకున్న తన కూతురు సెక్యూరిటీ వారు గార్డు వద్దకు వచ్చి అనుమతి అడిగిన లోపలికి రావడానికి అనుమతించకపోవడంతో హాస్ట ల్లో ఉన్న విద్యార్థులంతా రోడెక్కి ఆందోళనకు దిగారు.

రాత్రి పదిన్నర గంటల సమయంలో స్టూడెంట్ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ రాజేందర్ నాయక్ ఆందోళనకారులకు వద్దకు వచ్చి ఆందోళనను విరమించాలని చెప్పి నచ్చ చెప్పినప్పటికీ వినకపోవడంతో వెనుతిరిగారు. ఈ క్రమంలోనే ఏసిపి ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన కారులను అరెస్టు చేసి అంబర్‌పేట్ పీఎస్‌కు తరలించినట్లు సమాచారం.