calender_icon.png 13 February, 2026 | 9:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కౌంటింగ్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్

13-02-2026 12:00:00 AM

  1. ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పట్టణ ఓటర్లు 

ఆరు మున్సిపాలిటీ లు

126 వార్డులు

437 మంది బరిలో

పోలింగ్ కేంద్రాల్లో మూఢంచల భద్రత 

రంగారెడ్డి, ఫిబ్రవరి12 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలో ఓట్ల కౌంటింగ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఆరు మున్సిపాలిటీలో 126వార్డు ల స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. బరిలో 437 మంది ఉన్నారు. 78.99 శాతం పోలింగ్ నమోదయింది.

నేడు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన అనంతరం బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసి కట్టలుకడతా రు. తర్వాత ఓట్లను లెక్కించి రౌండ్ల వారీగా ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. మధ్యా హ్నం కల్లా  ఫలితాలపై స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొన్నారు.

 ఫలితాలపై ఉత్కంఠ..

ఆమనగల్లు, చేవెళ్ల, షాద్నగర్, శంకర్పల్లి, ఇబ్రహీంపట్నం,మొయినాబాద్ లో ఆయా మున్సిపల్ ఫలితాల కోసం పట్టణ ఓటర్లంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూపులు చూస్తున్నారు. 5 మున్సిపాలిటీలో అధికార పార్టీ కాంగ్రెస్,ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్ మధ్య, ఆమనగల్లులో త్రిముఖ పోరు నువ్వా నేనా అన్నట్టుగానే ఎన్నికలు జరిగాయి. కౌంటిగ్ కేంద్రాలను ఆమనగల్లు మున్సిపాలిటీ  బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్,

చేవెళ్ల, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ  శేరిగూడలోని శ్రీ ఇందు ఇంజనీరింగ్ కాలేజీలో, మొయి నాబాద్ మ్యాక్ ఫార్మసీ కాలేజీలో, షాద్నగర్   మిని స్టేడియంలో, శంకర్పల్లి  టీఎస్ మోడల్ స్కూల్ భవనంలో  ఓట్ల కౌంటింగ్ చేపట్టనున్నారు. ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేకంగా టేబుల్ లోనే ఏర్పాటు చేసి సిద్ధం చేశారు. అమనగల్ (5) చేవెళ్ల,(9) ఇబ్రహీంపట్నం(12) మొయినాబాద్(14) షాద్ నగర్ (14)శంకర్పల్లిలో (10) టేబుల్‌లు,

కౌంటింగ్ సూపర్వైజర్లు, రిజర్వ్ కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు మరియు రిజర్వ్ కౌంటింగ్ అసిస్టెంట్లను మొత్తం 64 మంది సూపర్వైజర్లు, 27 మంది రిజర్వ్ సూపర్వైజర్లు, 128 మంది అసిస్టెంట్లు మరియు 46 మంది రిజర్వ్ అసిస్టెంట్లు ను నియమించారు. ఫలితాలు అనంతరం ఈనెల 16న  ఆయా మున్సిపాలిటీలో ప్రత్యేక అధికారుల సమక్షంలో ఉదయం 11 గంటలకు మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు కోఆప్షన్స్ సభ్యుల ఎంపిక ఉంటుంది.

మొత్తం ఆరు మున్సిపాలిటీలు 

మొత్తం వార్డులు 126

పోలింగ్ కేంద్రాలు 274

మొత్తం ఓటర్లు 1,76,023

పోలైన ఓట్లు 1,38,222

పోలింగ్ శాతం 78.99