20 August, 2026 | 3:04 PM

శక్తి విలీనం వద్దు.. జీవో 97ను రద్దు చేయాలి

20-08-2026 01:24 PM

చేగుంట పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థుల మానవహారం

చేగుంట,ఆగస్టు 19: సాంకేతిక విద్యను ‘శక్తి’ శాఖలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం చేగుంట  పాలిటెక్నిక్( Chegunta Polytechnic College)  విద్యార్థులు గాంధీ చౌరస్తా వద్ద మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. ఐటీఐ, పాలిటెక్నిక్ విభాగాలను విలీనం చేయడం వల్ల సాంకేతిక విద్యకు నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. విద్యాశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) వెంటనే స్పందించి జీవో నంబర్ 97ను ఉపసంహరించుకుని, సాంకేతిక విద్యా వ్యవస్థను యథాతథంగా కొనసాగించాలని విద్యార్థులు కోరారు. సాంకేతిక విద్యను విలీనం చేయడం కంటే ఆధునిక ప్రయోగశాలలు, నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ దానిని మరింత బలోపేతం చేయాలని అన్నారు.