20 August, 2026 | 2:48 PM

శ్రీనుబాబుకు ఆదివరాహ స్వామి జయంతి ఉత్సవాల ఆహ్వానం

20-08-2026 01:57 PM

మంథని, ఆగస్టు 20 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలంలోని ఆది వరహాల స్వామి  జయంతి ఉత్సవాలకు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబును ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ మేరకు ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ చైర్మన్ ముస్త్యాల దామోదర్, ఈవో కాంతారెడ్డి, డైరెక్టర్లు, ఆలయ అర్చకులు శ్రీను బాబుకు అందజేశారు. ఈ సందర్భంగా ఉత్సవాల ఏర్పాట్లు, కార్యక్రమాల వివరాలను శ్రీను బాబుకు వివరించారు. ఆదివరాహ స్వామి జయంతి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కమిటీ సభ్యులు కోరారు.